Gmail ప్రోగ్రామ్ విధానాలు

Gmail ఉపయోగించే అందరికీ సానుకూలమైన అనుభవం అందించే విషయంలో Gmail ప్రోగ్రామ్ విధానాలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఈ విధానాలు మారే అవకాశం ఉన్నందున వాటిని తరచూ గమనిస్తూ ఉండండి. దయచేసి మరింత సమాచారం కోసం Google సేవా నిబంధనలను కూడా చూడండి.

స్పామ్ మరియు ఒకేసారి అనేక మెయిల్‌లు పంపడం

స్పామ్‌ను లేదా అవాంఛిత వాణిజ్య మెయిల్‌లను పంపిణీ చేయడానికి Gmailని ఉపయోగించవద్దు.

మీరు CAN-SPAM చట్టాన్ని లేదా ఇతర స్పామ్ నిరోధక చట్టాలను ఉల్లంఘించి ఇమెయిల్ పంపేందుకు; బహిరంగ, మూడవ పక్ష సర్వర్‌ల ద్వారా అనధికారిక ఇమెయిల్ పంపేందుకు; లేదా ఎవరైనా వ్యక్తి ఇమెయిల్ చిరునామాలను వారి సమ్మతి లేకుండా పంపిణీ చేసేందుకు Gmail ఉపయోగించడానికి అనుమతించబడరు.

వినియోగదారులను తప్పుదారి పట్టించే లేదా మోసగించే క్రమంలో ఇమెయిల్‌లు పంపడానికి, తొలగించడానికి లేదా ఫిల్టర్ చేయడానికి మీరు Gmail ఇంటర్‌ఫేస్‌ను స్వయంచాలకం చేయడానికి అనుమతించబడరు.

దయచేసి మీ దృష్టిలో "అభ్యర్థించని" లేదా "అవాంఛిత" మెయిల్ అంటే వేరే అర్థం ఉన్నప్పటికీ మీ ఇమెయిల్ స్వీకర్తల దృష్టికోణంలో భిన్నంగా ఉండవచ్చని గుర్తుంచుకోండి. ఇమెయిల్‌ను అనేకమంది స్వీకర్తలకు పంపుతున్నప్పుడు, ఆ స్వీకర్తలు గతంలో మీ నుండి ఇమెయిల్‌లు స్వీకరించేలా ఎంచుకున్నప్పటికీ పంపే నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. Gmail వినియోగదారులు ఇమెయిల్‌లను స్పామ్ వలె గుర్తు పెట్టినప్పుడు, మా దుర్వినియోగ నిరోధక సిస్టమ్‌లు మీరు భవిష్యత్తులో పంపే సందేశాలను కూడా స్పామ్‌గా వర్గీకరించే అవకాశం పెరుగుతుంది.

బహుళ Gmail ఖాతాల రూపకల్పన మరియు వినియోగం

Google విధానాలను దుర్వినియోగం చేయడానికి, Gmail ఖాతా పరిమితులను దాటి వ్యవహరించడానికి, ఫిల్టర్‌లు పనిచేయకుండా చేయడానికి, లేదంటే మీ ఖాతాపై విధించిన నియంత్రణలను ఎత్తివేయడానికి బహుళ ఖాతాలను సృష్టించవద్దు లేదా వినియోగించవద్దు. (ఉదాహరణకు, మీరు మరొక వినియోగదారు ద్వారా బ్లాక్ చేయబడితే లేదా దుర్వినియోగం కారణంగా మీ Gmail ఖాతా నిలిపివేయబడితే, అదే రకమైన కార్యాచరణల్లో పాల్గొనేందుకు మరొక ఖాతాను సృష్టించవద్దు.)

అలాగే మీరు స్వయంచాలక మార్గాల్లో Gmail ఖాతాలను సృష్టించడానికి లేదా Gmail ఖాతాలను కొనుగోలు చేయడానికి, ఇతరులకు అమ్మడానికి, వర్తకం చేయడానికి లేదా తిరిగి విక్రయించడానికి కూడా అనుమతించబడరు.

మాల్వేర్

వైరస్‌లను, మాల్వేర్‌ను, వార్మ్‌లను, దోషాలను, ట్రోజన్ హార్స్‌లను, పాడైన ఫైల్‌లను లేదా వినాశన లేదా మోసపూరిత స్వభావం గల ఇతరత్రా అంశాలను పంపడానికి Gmailని ఉపయోగించవద్దు. Google లేదా ఇతరత్రా వాటికి చెందిన నెట్‌వర్క్‌లు, సర్వర్‌లు లేదా ఇతర వ్యవస్థల పనితీరుకు హాని కలిగించే లేదా జోక్యం చేసుకొనే కంటెంట్‌ను పంపిణీ చేయవద్దు.

మోసాలు, ఫిషింగ్ మరియు ఇతర వంచనాత్మక కార్యాచరణలు

మీరు మరొక వినియోగదారు Gmail ఖాతాను వారి నుండి ప్రత్యేక అనుమతి లేకుండా ప్రాప్యత చేయలేకపోవచ్చు. ఇతర వినియోగదారులు వారి సమాచారాన్ని వెల్లడించేలా వారిని తప్పు పేర్లతో మాయ చేయడానికి, తప్పుదారి పట్టించడానికి లేదా మోసగించడానికి Gmailని ఉపయోగించవద్దు.

లాగిన్ సమాచారం, పాస్‌వర్డ్‌లు, ఆర్థిక వివరాలు లేదా ప్రభుత్వ గుర్తింపు సంఖ్యల వంటి వినియోగదారుల డేటాను పొందడం కోసం ఫిషింగ్ చేయవద్దు లేదా ఇతరులను మోసగించాలనే ఉద్దేశంతో Gmailను ఉపయోగించవద్దు.

పిల్లల భద్రత

పిల్లల లైంగిక వేధింపుల చిత్రాల పట్ల Google ఉపేక్షించని విధానాన్ని కలిగి ఉంది. మాకు ఇలాంటి కంటెంట్ గురించి తెలిస్తే, మేము ఆ సంగతిని చట్టప్రకారం తప్పిపోయిన మరియు పీడింపబడిన పిల్లల జాతీయ కేంద్రానికి నివేదిస్తాము. మేము ఇటువంటి కార్యాచరణల్లో పాలుపంచుకున్న Gmail ఖాతాలకు వ్యతిరేకంగా క్రమశిక్షణా చర్యను, అవసరమైతే ఖాతా మూసివేత చర్యను కూడా తీసుకోవచ్చు.

Google prohibits the grooming of children using Gmail, defined as a set of actions aimed at establishing a connection with a child to lower the child's inhibitions in preparation for sexual abuse, trafficking, or other exploitation.

If you believe a child is in danger of or has been subject to abuse, exploitation, or been trafficked, contact your local law enforcement immediately.

If you have already made a report to law enforcement and still need help, or you have concerns a child is being or was subjected to grooming using Gmail, you can report the behavior to Google using this form. Please remember that you can always block any person you do not want to be contacted by on Gmail.

కాపీరైట్

కాపీరైట్ చట్టాలను గౌరవించండి. పేటెంట్, వ్యాపార చిహ్నం, వ్యాపార రహస్యం లేదా ఇతర యాజమాన్య హక్కులతో సహా ఇతరుల మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించవద్దు. అలాగే మీరు మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించమని ఇతరులను ప్రేరేపించడానికి లేదా ప్రోత్సహించడానికి కూడా మీరు అనుమతించబడరు. మీరు ఈ ఫారమ్ని ఉపయోగించి Googleకి కాపీరైట్ ఉల్లంఘనను నివేదించవచ్చు.

వేధింపు

ఇతరులను వేధించడానికి, భయపెట్టడానికి లేదా బెదిరించడానికి Gmailని ఉపయోగించవద్దు. ఎవరైనా ఈ ఉద్దేశాలతో Gmailని ఉపయోగిస్తున్నట్లు గుర్తిస్తే వారి ఖాతాను నిలిపివేయవచ్చు.

చట్టవిరుద్ధ కార్యాచరణ

దీన్ని చట్టబద్ధంగా ఉంచండి. చట్ట వ్యతిరేక కార్యాచరణలను ప్రచారం చేయడానికి, నిర్వహించడానికి లేదా అటువంటి వాటిలో పాలుపంచుకోవడానికి Gmailని ఉపయోగించవద్దు.

విధానం అమలు

మీరు ఈ ఫారమ్ను ఉపయోగించడం ద్వారా దుర్వినియోగాన్ని నివేదించవచ్చు. Google ఈ విధానాలను ఉల్లంఘిస్తున్నట్లుగా గుర్తించిన ఖాతాలను నిలిపివేయవచ్చు. మీ ఖాతా నిలిపివేయబడితే మరియు ఇది పొరపాటున జరిగిందని మీరు విశ్వసిస్తే, దయచేసి ఈ పేజీలోని సూచనలను అనుసరించండి.